top of page

Welcome to Vasavi Clubs International SAPTHAPADHI

According to the tenets of Hinduism, marriage is a sacred relationship, a sacrament, and a divine covenant meant for procreation and continuation of family lineage. It is a vow between two people to stay together and uphold traditional family values in accordance with the Dharma. 

VASAVI CLUBS INTERNATIONAL proudly starts an exclusive Complete Free of Cost Arya Vysya matrimonial service. It is an online matrimonial matchmaking service exclusively for Arya Vysya Community across the globe with 100% Free of Cost. 

We aim to establish this Arya Vysya marriage portal as a largest online database of Arya Vysya brides and Arya Vysya grooms.

పెళ్ళి అనే పదానికి వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. హిందూ వివాహం ఒక పవిత్ర కార్యము. 

జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. 

పెళ్ళి చూపులు : తెలుగు వారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి, సంతోషం ఎవరూ మరువలేరు. సకుటుంబ సపరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరువలేని సంఘటన. పెళ్ళి చూపులతో పెళ్ళి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సాంప్రదాయం ప్రకారం అబ్బాయి, అమ్మాయి ఇంటికి బంధువర్గ సమేతంగా వెళ్ళి అమ్మాయిని చూస్తారు. కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ కుదిరాక నిశ్చితార్థపు తేదీ నిర్ణయించు కుంటారు. 

ప్రస్తుత మారిన కాలానికి అనుగుణముగా, ప్రస్తుతము ప్రపంచము మరియు దేశము ఉన్న పరిస్తుతులవలన పైన పేర్కొన్న విధముగా పెళ్ళి చూపులు జరుపుట కష్టము కనుక  ఆన్లైన్ లో వధూ వర పరిచయ వేదిక తేదీ 30-07-2020 న ప్రారంభించుట జరిగినది. 

మా ఈ సేవలు పూర్తి ఉచితముగా మన ఆర్య వైశ్య కుటుంబాలకు సేవ చేసే ఉద్దేశముతో మొదలు పెట్టుట జరిగినది. 

రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి వధువు లేదా వరుడు యొక్క వివరాలు పొందు పరచిన వారికి ప్రతి ఆదివారం నాడు అబ్బాయిలను , అమ్మాయిలను ఆన్లైన్లో వాళ్ల కుటుంబానికి పరిచయం చేస్తాము అదేవిధముగా మన ఫేస్బుక్ గ్రూప్ లో ప్రత్యక్ష ప్రసారము తో ప్రపంచములో ఉన్న మన ఆర్య వైశ్యులు అందరు చూసే విధముగా ఆన్లైన్ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నాము.

మీకు తెలిసిన మన ఆర్యవైశ్య యువతీ, యువకులు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మన ఈ సేవలు ఉపయోగించుట కొరకు  
తెలియ చేయ వలసిందిగా మనవి చేస్తున్నాము.

జై శ్రీ వాసవి  

bottom of page